Categories

గొల్లపూడి గారి "చట్టానికి కళ్ళు లేవు" వ్యాసానికి నా స్పందన

గొల్లపూడి గారి "చట్టానికి కళ్ళు లేవు" వ్యాసానికి నా స్పందన

Screen-Shot-2013-06-13-at-6.04.26-PM.png

gollapudi  

 

 

 

 

 

 

 

ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవగోరితే పైన ఇమేజ్ ని క్లిక్ చేయండి.  ఇప్పుడు నా స్పందన క్రింద చదవండి.

-------

గౌరవనీయులు మారుతీరావు గారికి నమస్కారము.

మీ వ్యాసం "చట్టానికి కళ్ళు లేవు" పత్రికలలో వొచ్చిన ఏక పక్ష వార్తలతో ప్రభావితమైనట్టు ఉంది.

మీ వ్యాసం చదివిన తరువాత అప్పటి వరకు నాకు తెలియని ఆ సంఘటన తాలూకు విషయాన్ని కొంచెం లోతుగా సోధించాను. ఒక వార్హ్త ప్రకారం, రామ్చరణ్ని వేధించిన / రామ్చరణ్ కొట్టించిన' ఆ కుర్రాళ్ళు తరువాత పోలీస్ స్టేషన్లో తప్పు తమదేనని ఒప్పుకుని రామ్చరణ్ తేజకి క్షమార్పణ చెప్పారుట. అతను దానితో సంతృప్తి చెంది, వారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, కేసుని విరమించుకొని, ఆ విషయాన్ని ఇఖ అక్కడితో వొదిలేసాడుట .

ఈ వార్త  అనుమానస్పదమైతె, "తేజ కొవ్వెక్కి జనాన్ని కొట్టిన్చాడనే" వార్తని అంతే అనుమానంతో చూడాలి.  సినిమాలన్న సినిమా తారలన్న జనంలో ఉండే వేలంవెర్రి తరచూ చూస్తూనే ఉన్తాము. నిజానికి ఆ ఇద్దరు కుర్రాళ్ళు వెకిలి  వేషాలు వేసి ఉండవచ్చు.  అందున తన భార్య దగ్గరున్నపుడు. ఈ సందర్భంలో, సగటు వాడైతె తనే గొడవ పడతాడు, అంగబలం ఉన్నవాడు కనుక, రామ్చరణ్ తన వాళ్లకి కను సైగ చేశాడు.

ఈ గొడవ ఏ ఇద్దరు సగటు వ్యక్తుల మధ్య మన కళ్ల ముందే జరిగినా, "ఆ..  తప్పు ఎవడిదోలె..." అని ఇద్దరికీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తాము. కానీ, ఒక ప్రముఖుడి విషయంలో మాత్రం, మనం చూడని విషయాన్ని, పత్రికల కధనంతొ ఉదారంగా తొందరగా ఎకీభవించేస్తాము. దీనికి మీరు కూడా (ప్రముఖులు, సినీ నేపధ్యం ఉన్నవారు) అతీతులు కాకపోవటం, విస్మయాన్ని కలిగించింది.

నిజానికి ఈ రోజుల్లో పత్రికలలో వొచ్చిన ఏ వార్తని యదాతధంగా నమ్మలేని పరిస్థితి. ఇది, ప్రతీ విషయాన్నిసంచలనాత్మకం చేయబూనే పత్రికల స్వయంకృతాపరాధం, మన దౌర్భాగ్యం. రాంచరణ్ కి వ్యతిరేకంగా మీ ఘాటైన వ్యాసం, ఈ విషయాన్ని విస్మరించినట్టు, "మేము సెలేబ్రిటీలం కనుక మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు" అనే వాళ్లకి ఊతం ఇచ్చేట్టు గాను ఉంది.

ఇంతకీ నేను ఏ రామ్చరణ్ అభిమాన సంఘ అధ్యక్షుదినో అనుకునేరు, కేవలం నిమిత్తమాత్రుడిని, ప్రవాసాంధ్రుడిని, తెలుగు భాషా వైభవాభిలషిని - మీ అభిమానిని.

ఇట్లు,

భవదీయుడు,

కిరణ్ కుమార్.

Are you a Photographer or a Spidographer?

Are you a Photographer or a Spidographer?

The Anatomy of a Disengaging Audience.

The Anatomy of a Disengaging Audience.